రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలుKathi Mahesh
2021-06-26 19:17:29

రోడ్డుప్ర‌మాదంలో సినీ న‌టుడు క‌త్తి మ‌హేశ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు..ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ‌హేశ్ త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో అత‌న్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని మెడిక‌వ‌ర్ కార్పొరేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
 

More Related Stories