కంగనా బాడీ గార్డ్ పై రేప్ కేసుKangana Ranaut
2021-05-22 12:58:55

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పర్సనల్ బాడీ గార్డ్ పై రేప్ కేసు నమోదయింది. కంగనా వద్ద చాలా ఏళ్లుగా పని చేస్తున్న కుమార్ హెగ్డే పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్ హెగ్డే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించడం తో కేసు బుక్ చేశారు. ప్రస్తతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా మేకప్ ఆర్టిస్ట్ తో కుమార్ కు 8ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. 

అయితే తనను కుమార్ ప్రేమించాడని పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడని  యువతి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటా అని చెప్పి లొంగదీలుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే కుమార్ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా తన వద్ద నుండి కుమార్ కొంత డబ్బును కూడా తీసుకున్నట్టు వెల్లడించింది. ఇప్పుడు కుమార్ తల్లి తనకు ఫోన్ లు చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిబతిసుకురావద్దని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు లో పేర్కొంది. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా స్పందించే కంగనా రనౌత్ ఇప్పుడు తన డ్రైవర్ చేసిన తప్పు పై ఎలా స్పందిస్తున్నా అన్న ఆసక్తి మొదలయ్యింది.

More Related Stories