కరోనా వ్యాక్సిన్ తో ప్రశాంత్ వర్మ...రేపు టెస్ట్ అటprasanth
2020-05-29 03:25:29

తెలుగులో అప్పటికప్పుడు పరిస్థితులని బేస్ చేసుకుని సినిమాలు చేసే దర్శకులు చాలా తక్కువ. తక్కువ అనే కంటే వర్మ తప్ప ఎవరూ లేరని చెప్పాలి. కానీ వర్మ కూడా ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చలో పడి అలాంటి సినిమాలను తీస్తున్నాడు కానీ, అవి కంటెంట్ కి తగ్గట్టుగా ఉండడం లేదు. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మీద సినిమా వర్మనే చేస్తాడని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఒక సినిమా చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే అది కరోన వైరస్ మీద లేదు, కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ వలన చేశాడు. అయితే తెలుగులో మరో దర్శకుడు ముందుకు వచ్చి ఈ సబ్జెక్ట్ మీద ఆయన సినిమా చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఆయన ఎవరో కాదు ఆ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ. క‌రోనా వైర‌స్‌పై ఆయన ముందే సినిమా అనుకున్నడని అది ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిందని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ ఆయన సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ప్రీ లుక్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ పోస్టర్‌పై కరోనా వ్యాక్సిన్ అని రాశారు. ఇంజక్షన్ సిరంజిలో 10 శాతం లోడ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పరీక్ష చేయనున్నామని పేర్కొన్నారు. అంటే, రేపు ఉదయం ఫస్ట్ లుక్ రాబోతోందని కరోనా పరిబాషలో పేర్కొన్న్నారు.  ఈ సినిమా టైటిల్ ఏంటి? కరోనా వ్యాక్సినే టైటిలా? ఇతర వివరాలు రేపు తెలియనున్నాయి. తన తొలి రెండు సినిమాల్లోనూ వినూత్నమైన కధలతో వచ్చిన ప్రశాంత్ వర్మ.. ఈ మూడో చిత్రంలో కూడా ఏదో కొత్తదనం చూపించబోతున్నాడన్న మాట. 

More Related Stories