ఏజెంట్ కు క్లాప్ కొట్టిన నాగార్జునAkhil
2021-04-08 14:50:27

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ వెలుతున్నాడు. అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్ప‌టివ‌ర‌కూ మూడు సినిమాల్లో న‌టించాడు. అయితే ఈ మూడు సినిమాల‌కు అకిల్ కు నిరాశే మిగిలింది.ఇక ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచుల‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. సినిమాలో అఖిల్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇదిలా ఉండానే అఖిల్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. 

ఇక ఈ రోజు సినిమా తాలూకా ఫ‌స్ట్ లుక్ మ‌రియు టైటిల్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్టర్ లో అఖిల్ స్టైలిస్ గా ర‌ఫ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. లాంగ్ హెయిర్ తో సిగ‌రెట్ కాలుస్తూ అఖిల్ ఎప్పుడూ క‌నిపించ‌ని లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ రోజు అధికారికంగా ఈ సినిమాను లాంచ్ చేశారు. లాంచింగ్ కార్య‌క్ర‌మానికి అఖిల్ తండ్రి హీరో నాగార్జున మ‌రియు త‌ల్లి అమ‌ల కూడా వ‌చ్చారు. అంతే కాకుండా నాగార్జున ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఇక సురేంద‌ర్ రెడ్డి అయినా అఖిల్ కు హిట్ ఇస్తారో లేదో చూడాలి. 

More Related Stories