సుకుమార్ అల్లు అర్జున్ సినిమాకు షాక్ ఇచ్చిన అధికారులు..sukumar
2019-11-20 19:28:10

రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొని అల్లుఅర్జున్ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సంచలన దర్శకుడు సుకుమార్. మరోసారి విభిన్నమైన కథతో వస్తున్నాడు ఈయన. మాస్ ప్రేక్షకులను అలరించేలా పూర్తిగా స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండే కథను ఎంచుకున్నాడు సుకుమార్. ఈ సినిమాలో శేషాచలం కొండల్లో జరిగే గంధపు చెక్కల స్మగ్లర్ చూపించబోతున్నాడు ఈ దర్శకుడు.  అల్లు అర్జున్ ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. సహజత్వం కోసం దట్టమైన శేషాచలం అడవులలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాడు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం సుకుమార్ ఇప్పటికే శేషాచలం అడవులలోని కొండలు లోయలు దాటుకుని వెళ్లి లొకేషన్లు వెతికి ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. దీనికోసం తమిళనాడు ఆంధ్ర బార్డర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన దట్టమైన ఫారెస్ట్ ఏరియాను సుకుమార్ ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే సుకుమార్ వేసుకున్న ఈ యాక్షన్ ప్లాన్ కు అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అధికారులు సుకుమార్ కు అనుమతి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ అడవుల్లో పులులు సింహాలదే రాజ్యం. అలాంటి చోట షూటింగులకు అనుమతులు అంటే అధికారులు లేనిపోని తలనొప్పులతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అనుమతులను నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బన్నీ సినిమా కోసం ఇప్పుడు బ్యాంకాక్  ఎంచుకున్నాడు సుకుమార్. అక్కడ అడవులను శేషాచలం ఫారెస్ట్ మాదిరి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని బన్నీ లుక్ ఖైదీ సినిమాలో కార్తీ లుక్ ను పోలి ఉంటుందని లీకులు వస్తున్న సందర్భంలో ఇందులో బన్నీ లుక్ కొత్తగా చూపించడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమా నిర్మించనుంది.

 

More Related Stories