ఒకప్పుడు వ్యభిచారం చేసింది.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతుంది..bolywood
2020-05-13 07:48:30

జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్లో ఒక రైటర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు ఆమె కనీసం తినడానికి కూడా డబ్బులు లేక వ్యభిచారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ గా చక్రం తిప్పుతుంది. ఆమె ఎవరో కాదు షాగుఫ్తా రఫీక్. ఈ రోజు వరకు ఆమె తల్లి దండ్రులు ఎవరో తెలియదు. ఓ మహిళ షాగుఫ్తాని దత్తత తీసుకుని పెంచుకుంది. ఆమె పెంపుడు తల్లి మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం.. అతడు ఆకస్మిక మరణం చెందడంతో ఉన్నపళంగా కుటుంబ భారం అంతా ఈమెపై పడిపోయింది. అలాంటి తరుణంలో షాగుఫ్తా 16 ఏళ్ల వయసులోనే కుటుంబ పోషణ కోసం బార్ డాన్సర్ గా.. వ్యభిచారిగా మారింది. ఆ సమయంలో తప్పని పరిస్థితుల్లో డబ్బు కోసం ఆమె వ్యభిచారం చేసింది.

ప్రైవేట్ పార్టీలలో అంగాంగ ప్రదర్శన చేస్తూ డాన్స్ చేస్తుంటే తనపై డబ్బులు చల్లేవారని షాగుఫ్తా రఫీక్ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. ఒక మహిళని సమాజంలో ఎంత హీనంగా చూస్తారనేది అప్పుడు తనకు అర్థం అయింది అంటూ చెప్పింది. సమయం ఇలా జరుగుతూ ఉండగానే తన రైటింగ్ పై ఉన్న ఆసక్తిని గమనించి అటువైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా నిర్మాత మహేష్ భట్ ఆమెకు అవకాశం ఇచ్చాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రోజు మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ అనిపించుకుంది షాగుఫ్తా. ఈమె రాసిన రాజ్, మర్డర్ 2, జిస్మ్ 2, ఆషిక్ 2 లాంటి రొమాంటిక్ సినిమాలు విజయం సాధించాయి. తెలుగులో సచిన్ జోషి హీరోగా వచ్చిన  నీజతగా నేనుండాలి అనే చిత్రానికి ఈమె కథ అందించింది.  మొత్తానికి ఎక్కడో మొదలై ఇప్పుడు ఎక్కడో ఉంది షాగుప్తా.

More Related Stories