గాలి సంపత్ మూవీ రివ్యూ Gaali Sampath
2021-03-11 19:20:43

చిత్రం: గాలి సంపత్‌.
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్‌, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్‌, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు తదితరులు,
సంగీతం: అచ్చు,
సినిమాటోగ్రఫీ; సాయి శ్రీరామ్‌, 
ఎడిటింగ్‌; బి.తమ్మిరాజు, 
నిర్మాత: ఎస్‌.కృష్ణ, హరీశ్‌ పెద్ది, సాహు, గారపాటి,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ: అనిల్‌ రావిపూడి,
కథ, దర్శకత్వం: అనీశ్‌ కృష్ణ.

కథ: గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) ఇతనికి నాటకాలంటే పిచ్చి.. గొంతులేకపోవడం వల్ల నాటకాల్లో రాణించాలనే కలను సాకారం చేసుకోలేకపోతుంటాడు. ఇతని కొడుకే సూరి (శ్రీవిష్ణు). అరకులో ట్రక్ డ్రైవర్. ఎప్ప‌టికైనా నాట‌కాల్లో బ‌హుమ‌తి గెలిచి త‌న కొడుక్కి  ట్రక్  కొని ఇవ్వాల‌నేది ఆయ‌న క‌ల‌.  అందుకోసం  ఊళ్లో త‌న గ్యాంగ్‌తో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఓ రోజు పెద్ద గొడ‌వే జ‌రుగుతుంది. ఆ బాధ‌లో ఉండ‌గానే అనుకోకుండా ఇంటి ప‌క్క‌నున్న 30 అడుగుల నూతిలో ప‌డిపోతాడు గాలి సంపత్.  ఆ గోతిలో నుంచి సంపత్ ఎలా బయటకు వచ్చాడు? కనిపించకుండా పోయిన తండ్రి కోసం కొడుకుపడిన తపన ఏంటి? అన్నదే మిగిలిన కథ.

కథనం: ప్ర‌థ‌మార్ధం సినిమా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచుతూ సాగుతుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌కి పెద్ద‌పీట వేశారు. థ్రిల్లింగ్ అంశాల‌కి కూడా చోటున్న‌ప్ప‌టికీ... ఆ నేప‌థ్యంలో  సాగే స‌న్నివేశాల్ని మ‌రింత స‌హ‌జంగా, బ‌లంగా చూపించడంలో చిత్ర బృందం కాస్త తడబడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ లవ్‌లీ సింగ్.. హీరోతో లవ్ ట్రాక్ కోసమే పెట్టినా పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.ఈ సినిమాకు నిర్మాత ఎస్.కృష్ణ కథ అందించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి స్క్రీన్ ‌ప్లే అందించారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. దీంతో దర్శకుడు అనీష్ పని సులభమైంది. తనపై మిగిలిన బాధ్యతలు తగ్గడంతో డైరెక్టర్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు అనీష్. ప్రతి సన్నివేశంలోనూ ఆయన పర్ఫెక్షన్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి 100 శాతం నటనను ఆయన రప్పించుకోగలిగారు. 

నటీనటులు: శ్రీవిష్ణు త‌నకి అల‌వాటైన పాత్ర‌లోనే క‌నిపిస్తూ భావోద్వేగాలు పండించారు.  నిజానికి ఈ సినిమా మొత్తం గాలి సంపత్ పాత్ర చుట్టూనే నడుస్తుంది. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీ విష్ణు తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ విశ్వరూపం చూపిస్తాడు. కేవలం హావభావాలతోనే ప్రేక్షకుల్ని కుర్చీల నుంచి కదలకుండా చేశాడు. నవ్విస్తూ.. ఏడిపిస్తూ.. తన హావభావాలతో వారెవ్వా అనేట్టుగా చేశారు నటకిరీటి. సినిమాలో కమెడియన్ సత్య పాత్ర చాలా కీలకం. గాలి సంపత్ పాత్రకి ట్రాన్స్‌లేటర్‌గా ఇరగదీశాడు. కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు సత్య. శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ర‌ఘుబాబు, ర‌జిత త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. 

టెక్నిక‌ల్ టీం: ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సాయి శ్రీరాం తన సినిమాటోగ్రఫితో ఆకట్టుకొన్నాడు. అరకు అందాలను తన కెమెరాలో అద్భుతంగా పట్టుకొన్నాడు. తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి.

చివ‌ర‌గా.. ‘గాలి సంపత్‌'...ఫి.. ఫి.. ఫీ( రాజేంద్ర ప్రసాద్ ) షో.   

రేటింగ్ : 2.75/

More Related Stories