గ్యాంగ్ లీడర్ అడ్రస్ గల్లంతు చేసిన గద్దలకొండ గణేష్..GaddalakondaGaddalakonda Ganesh Gangleader.jpg
2019-09-25 14:00:23

ఇంటా బయటా అనే తేడా లేకుండా అన్ని చోట్లా గ్యాంగ్ లీడర్ ను పూర్తిగా ముంచేసాడు గద్దలకొండ గణేష్. ఈ సినిమా వచ్చిన తర్వాత కనీసం యావరేజ్ అయినా అవుతుందనుకున్న గ్యాంగ్ లీడర్ పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది. స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మరీ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు కూడా తిప్పికట్టారు. ఓవర్సీస్ లో నానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అక్కడ విక్రమ్ సినిమాకు కూడా క్రేజ్ ఎక్కువే.. కానీ కొత్తదనం ఉంటేనే వాళ్లు పట్టించుకుంటారు. గ్యాంగ్ లీడర్ లో అది మిస్ అయ్యేసరికి అక్కడ కూడా సినిమా మిస్ ఫైర్ అయిపోయింది. గద్దలకొండ గణేష్ విడుదలైన తర్వాత యుఎస్ మార్కెట్ లో గ్యాంగ్ లీడర్ ఒక్కసారిగా పడిపోయాడు.

ఈ సినిమా అక్కడ 177 లొకేషన్స్ లో విడుదలై ప్రీమియర్ షోల నుండి వీకెండ్ నాటికి 630,860 డాలర్లను వసూలు చేసింది. తర్వాత ఫైనల్ కలెక్షన్స్ 821,607కు చేరడంతో మిలియన్ మార్క్ అందుకుని సేఫ్ అవుతుందనుకున్నారంతా.. కానీ గద్దలకొండ గణేష్ విడుదల కావడంతో గ్యాంగ్ లీడర్ కు దెబ్బ పడిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ కూడా గద్దలకొండ గణేష్ వచ్చిన తర్వాత గ్యాంగ్ లీడర్ సీన్ సితార అయిపోయింది. మొత్తానికి వరుణ్ తేజ్ వచ్చి నాని అడ్రస్ గల్లంతు చేసాడు. 

More Related Stories