షాకింగ్..98 కేజీలు బరువు తగ్గిన బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్



Ganesh Acharya
2020-12-17 14:06:43

స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అయితే బరువు తగ్గితే ఆశ్చర్యపోవడం దేనికి అని డౌట్ రావచ్చు. కానీ ఆయన తగ్గింది 5కేజీలో 10 కేజీలో కాదు. ఎంకంగా 98 కేజీలు తగ్గి అందరినీ అవక్కయ్యేలా చేస్తున్నాడు. తాజాగా ఆయన కపిల్ శర్మ షోలో సందడి చేశారు. దాంతో ఆయన మెకోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. కపిల్ శర్మ కూడా మాకు గణేష్ ఆచార్య కావాలని.. మీరు వద్దు అని కామెంట్స్ చేసాడు. మీరు ఎంత బరువు తగ్గారని ప్రశ్నించగా గణేష్ ఆచార్య 98 కేజీలు తగ్గినట్టు చెప్పాడు.

దాంతో మీలో నుండి ఇద్దరిని చంపేసారంటూ కపిల్ శర్మ జోకులు పేల్చాడు. ఇక ఇదివరకు గణేష్ ఆచార్య 200 కేజీల వరకు ఉండేవాడు. ఇప్పుడు 98 కేజీలు తగ్గడం అంటే మాములు విషయం కాదు. ఒక్కొక్కరు 10 కేజీలు తగ్గలన్నా తెగ కష్టపడిపోతుంటారు. కానీ గణేష్ మాత్రం అంత బరువు ఎలా తగ్గాడాని మన కళ్ళు మనల్నే మోసం చేస్తున్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గణేష్ ఆచార్య ఎన్నో బాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి అవార్డులు అందుకున్నారు. అంత బరువుతో స్టెప్పులు వేసి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "డీజె" సినిమాలో "గుడిలో ఒడిలో" అనే పాటకు కూడా గణేష్ ఆచార్య స్టెప్పులు కంపోస్ చేశారు.

More Related Stories