వికాస్ దూబే కధతో వెబ్ సిరీస్

చాలా వరకు సినిమా మెటీరియల్ అంతా నిజజీవితాల నుండి ఇన్స్పైర్ అయిందే. అలా చాలా సినిమాలు తెరకెక్కాయి. తెరకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా వికాస్ దూబే అనే ఒక గ్యాంగ్ స్టర్ ఎన్కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అతను ఎనిమిది మంది పోలీసులను ఎన్కౌంటర్ లో చంపడంతో అతను టాక్ ఆఫ్ ది ఇండియాగా మారాడు. ఇప్పుడతని మీదే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రైం థ్రిల్లర్‌కు హనక్ అనే టైటిల్ పెట్టారు. నిర్మాత మనీష్ వాత్సల్య వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో పాటు ఆయనకి సంబంధించిన చాలా సమాచారాన్ని సేకరించారట. ఇక ఆయనని సిరీస్‌లో విలన్‌గా చూపించనున్నట్టు చెబుతున్నారు. ఇక వికాస్ దూబే పాత్రకి ఒక ప్రముఖ నటుడిని ఎంపిక చేయనున్నామని చెబుతున్నారు. వీధి రౌడీగా జీవితం ప్రారంభించి రాజకీయ నాయకుల అండదండలతో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు వికాస్ దూబే. అతడిని హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు తదితర 60కిపైగా కేసులు ఉన్నాయి. ఎనిమిది మంది పోలీసుల హత్య తర్వాత వికాస్‌ని టార్గెట్ చేశారు పోలీసులు. సరెండర్ అయినా తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెబుతూ కాల్చి చంపేశారు.