సినీ నటుడు గొల్లపూడి కన్నుమూతGollapudi maruthi rao
2019-12-12 20:38:17

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకు ముగ్గురు కుమారులు. వారు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ కాగా ప్రేమ పుస్తకం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చనిపోయిన గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి సాహితీ సేవ నందించారు. గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982)..గొల్లపూడి నటించిన చివరి చిత్రం: జోడి (ఆది సాయికుమార్). సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు..ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా మెప్పించారు. దాశరథి ప్రోత్సహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేశారు.

1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మారుతీరావు, 14 ఏళ్ల వయస్సులోనే మొదటి కథ ఆశాజీవి రాశారు. దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన డాక్టర్ చక్రవర్తికి తొలి సినిమా రచన చేసిన గొల్లపూడి, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరానికి రచయితగా పనిచేశారు. సాయంత్రం 6 తర్వాత సినిమా షూటింగ్ కి వెళ్లడానికి ఇష్టపడని మారుతీరావు సంవత్సరంలో 31 సినిమాలు చేసి రికార్డు సృష్టించాడు. మూడో చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసిన గొల్లపూడి కి బహుముఖ ప్రజ్ఞాసాలిగా పేరు గాంచాడు.
 

More Related Stories