చాణక్య కలెక్షన్స్.. గోపీచంద్‌కు మరో భారీ డిజాస్టర్..chan
2019-10-11 04:56:07

విడుదలైన నాలుగు రోజులకే ఫ్లాప్ అని తేలిపోయింది చాణక్య. అసలు ఈ చిత్రం వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారీ బడ్జెట్ తో గోపీచంద్ నటించిన ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. తిరు తెరకెక్కించిన ఈ చిత్రం దసరా టైమ్ లో వచ్చి క్యాష్ చేసుకుందాం అనుకుంటే.. సైరా దెబ్బకు కనీసం కనిపించకుండా పోయింది. ఈ సినిమా వైపు ప్రేక్షకులు అస్సలు కదలడం లేదు. కనీసం కలెక్షన్లు కూడా కోరుకున్నట్లు రావడం లేదు. క‌థ మ‌రీ రొటీన్ కావ‌డ‌ం.. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే ఉండటంతో చాణక్యతో డిస్ కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్. తొలిరోజు కేవలం 1 కోటి 20 లక్షలతో సరిపెట్టుకున్న చాణక్య.. తర్వాత మరో 2 కోట్లు కూడా తీసుకురాలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం 4 కోట్లు కూడా తీసుకురాలేదు. సినిమాలో గోపీచంద్ త‌న పాత్ర వ‌ర‌కు చంపేసాడు.

. ఈ పాత్ర కోస‌మే పుట్టాడా అనేంత‌గా ఇందులో ఒదిగిపోయాడు. రా ఏజెంట్ గా ప్రాణం పెట్టి నటించాడు. పాకిస్తాన్ కూడా వెళ్లి అక్కడ ఔరా అనిపించాడు. కానీ క‌థ స‌హ‌క‌రించ‌క‌పోతే పాపం ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు..? ఇప్పుడు చాణక్య విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడం.. పైగా సైరా థియేటర్లలో ఉండటంతో గోపీచంద్‌కు మరో షాక్ తప్పేలా లేదు. మొత్తానికి నాలుగు రోజుల్లో ఈ చిత్రం కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 12 కోట్లకు పైగా బిజినెస్ చేసిన చాణక్య డిజాస్టర్ అయిపోయింది.

More Related Stories