దసరాకే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న చాణక్యgopi
2019-09-08 16:52:27

ఈ మధ్య కాలంలో సరయిన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న గోపీచంద్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ తీరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చాణక్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిజానికి ఈ సినిమా గత మే నెలలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసారు. కానీ షూట్ లో ఉండగా గోపీచంద్ కి యాక్సిడెంట్ కావడంతో మొత్తం అంతా వాయిదా పడింది. సివియర్ సర్జరీ జరగడంతో గోపీచంద్ తో పాటు మిగతా ఆర్టిస్ట్స్ డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. మళ్ళీ ఆయన కోలుకున్నాక సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడనికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ దసరా రిలీజ్ అని మాత్రం ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను రేపు సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. చూడాలి మరో ఈ సినిమా అయినా గోపీకి కలిసొస్తుందో లేదో ?

More Related Stories