గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ అక్కడ దిగుతుంది..

ఎంత పెద్ద హీరో అయినా కెరీర్ లో ఏదో ఒక సినిమా మాత్రం కొన్ని సంవత్సరాల పాటు విడుదలకు నోచుకోకుండా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అలాంటి సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ కూడా దీనికి మినహాయింపు కాదు. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా వచ్చి కూడా 4 సంవత్సరాలు అయ్యుండేది. కానీ ఏం చేస్తాం.. టైమ్ బాగోలేనపుడు అరటిపండు తిన్నా పన్నురుగుద్ది అంటారు. ఇది నిజమే అనిపిస్తుందిప్పుడు. ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమా విషయమే మరిచిపోయారు దర్శక నిర్మాతలు.
మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కూడా అదే ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. ఈ సినిమాను భారీ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించాడు తాండ్ర రమేష్. దాదాపు 20 కోట్లతో ఆరడుగుల బుల్లెట్ తెరకెక్కింది. ఈ చిత్రానికి ఇంకా 6 కోట్ల బకాయిలు ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత చెప్పినా బయ్యర్లు వినడం లేదు. పక్కాగా డబ్బులు కట్టిన తర్వాత గానీ సినిమా విడుదల కానివ్వమంటున్నారు. దాంతో చేసేదేం లేక కామ్ గా ఉండిపోయాడు నిర్మాత. ఈ చిత్రానికి వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
ప్రకాశ్ రాజ్, నయనతార లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆరడుగుల బుల్లెట్ పరిస్థితి తయారైంది. ఫైనాన్షియర్లకు క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఇస్తే గానీ సినిమా విడుదల కాదు. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై గోపీచంద్ గాని.. దర్శకుడు బి.గోపాల్ కాని అస్సలు నమ్మకం పెట్టుకొనట్టే కనిపిస్తోంది. అయితే వీళ్ళు విడుదల చేస్తున్నది థియేటర్లో కాదు.. ఓటిటి ప్లాట్ ఫామ్ లో. గోపీచంద్ కు ఎలాగూ యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ వుండటం.. నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాను మంచి రేటుకి తీసుకుంటున్నారు డిజిటల్ సంస్థలు. తీవ్రమైన కూడా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్కడ దిగకుండా బుల్లెట్టు తప్పుపట్టడం కంటే.. ఎక్కడో ఒకచోట రావడమే నయం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.