నవంబర్ 23 నుండి సీటిమార్ షూటింగ్ పునప్రారంభంGopichand Seetimaarr
2020-11-17 17:42:49

అగ్రెసివ్ స్టార్ గోపిచంద్  దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "సీటిమార్". పవన్ కుమార్ సమర్పణలో "శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పథకం" పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో తమన్నా ప్రధాన కథ నాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా దిగంగాన నటిస్తున్నారు. ఈ సినిమా కరోనా లాక్డౌన్ కు  ముందే మూడు షేడూల్స్ పూర్తిచేసుకుంది. కాగా నవంబర్ 23 నుండి షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. నిర్మాత శ్రీనివాద్ చిట్టూరి మాట్లాడుతూ కరోనా లోక్డౌన్ కు ముందే రాజమండ్రి, హైదరాబాద్ ఆర్ఏప్సి లో  షూటింగ్ చేసి 60శాతం పూర్తి చేశామని ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా మంచి సాంకేతిక విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు  తెలిపారు..

డైరెక్టర్ సంపత్ నంది మాట్లడుతూ... లాంగ్ వార్మఫ్,సలాడ్ స్త్రచప్ ,పవర్  పాకిడ్ ప్రాక్టీస్ తర్వాతే ఈ సినిమాను మొదలు పెట్టామని కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. ఈ సినిమాలో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్ గా, మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ కబ్బడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇతర ప్రధాన తారాగణంగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక,రహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా నటిస్తున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన "గౌతమ్ నంద" సినిమాకు  కూడా సంపత్ నంది నే దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. మరి "సీటీమార్" సినిమా అయినా ఈ కాంబినేషన్ కు హిట్ ఇస్తుందా చూడాలి.
 

More Related Stories