గ‌ల్లీరౌడీ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంది - కోన వెంకట్



Gully Rowdy Pre Release Event
2021-09-16 21:59:42

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 17న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు, రైట‌ర్ కోన వెంక‌ట్ మాట్లాడుతూ... ‘‘ఇక నుంచి సినిమాయే మాట్లాడుతుంది. సినిమా క‌థ రాసింది భాను, నందు, తీసింది నాగేశ్వ‌ర్ రెడ్డి గారు. కానీ పోస్ట‌ర్‌ పై ఢీ, రెఢీ, దూకుడు సినిమా పేర్లు ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాల స్టైల్లో ఇది కూడా ఉంటుంద‌ని చెప్ప‌డానికి మాత్ర‌మే. నేను ప‌స్ట్ టైమ్ విష్ణుతో ఢీ, రామ్‌తో రెఢీ, మ‌హేశ్‌తో దూకుడు, ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే. అలాగే ఫ‌స్ట్ టైమ్ సందీప్‌తో చేసిన గ‌ల్లీరౌడీ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమాకు అన్ని చ‌క్క‌గా కుదిరాయి. అంద‌రూ మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కుదిరాయి. కామ‌న్ మేన్ హీరో సందీప్ కిష‌న్‌. సినిమా సినిమాకు త‌న గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తుంది. ఇది త‌న గ్రాప్‌ను మ‌రింత పెంచుతుంది. ఇంకా త‌ను గొప్ప స్థాయికి చేరుకుంటాడు. చిరంజీవిగారు అంత టైమ్ తీసుకుని మా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి మా టీమ్‌ను ఎంక‌రేజ్ చేసింద‌నుకు ఆయ‌నకు పాదాభివంద‌నాలు’’ అన్నారు.

హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ...‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ త‌ర్వాత ఎక్కువ ఆలోచించ‌కుండా స‌ర‌దాగా న‌వ్వుకునే ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వివాహ భోజ‌నంబు సినిమాను రూపొందించిన భాను, సాయి.. గ‌ల్లీ రౌడీ క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. వాళ్లు మ‌రో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆ క‌థ‌న‌ను నాగేశ్వ‌ర్ రెడ్డి గారి ద‌గ్గ‌ర‌కు పంపాను. ఆయ‌న‌కు న‌చ్చింది. సినిమా చేద్దామని అన్నారు. అక్క‌డ నుంచి కోన‌ గారి ద‌గ్గ‌ర‌కు క‌థ వెళ్లింది. కోన వెంక‌ట్‌ గారు, ఎం.వి. స‌త్య‌నారాయ‌ణ‌ గారితో మా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. జీవీ గారు నిర్మాత‌గా ముందుండి మ‌మ్మ‌ల్ని న‌డిపించారు. ఈ సినిమాను, క్యారెక్ట‌ర్స్‌ను చాలా స‌ర‌దాగా పూర్తి చేశాం. రాజేంద్ర‌ప్ర‌సాద్‌ గారు, బాబీసింహ‌ గారు, క‌ల్ప‌ల‌త‌ గారు, నిజాయ‌తీగా అంద‌ర్నీ న‌వ్వించ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే గ‌ల్లీరౌడీ. ఓ క్రైమ్ కామెడీని ఫ్యామిలీ జోన‌ర్‌లో తీస్తే ఎలా ఉంటుందో అనేదే సినిమా. హీరోయిన్ నేహాశెట్టి రోల్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. 

సాయికార్తీక్‌తో నేను చేసిన మూడో సినిమా. సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్ … ఇటు కోన‌ గారిని, అటు నాగేశ్వ‌ర్‌రెడ్డి గారిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశాడు. సినిమా ప్ర‌పంచం మారుతుంది. దాన్ని మ‌నం అడాప్ట్ చేసుకోవాలి. మీరు థియేట‌ర్స్‌కు వెళ్లి టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూసిన‌ప్పుడు, అందులో రూపాయో, పైసానో మా మెతుకుపై మీ పేరు ఉంటుంది. మీరు సినిమా చూడ‌ట‌మే నాకు ముఖ్యం. థియేట‌ర్‌లో సినిమా చూసే అవ‌కాశం ఉంటే త‌ప్ప‌కుండా అలాగే చేస్తాం. మంచి సినిమా తీశాం. అంద‌రూ హ్యాపీగా న‌వ్వుకుంటార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు మా సినిమాను చూసి బావుంద‌ని అప్రిషియేట్ చేస్తే చాలు. అదే మా స‌క్సెస్‌. ట్రైల‌ర్ చూసిన చిరంజీవి గారు.. సందీప్ నీకు ఇలాంటి క్యారెక్ట‌ర్స్ చాలా బావుంటాయి. ఇలాంటి పాత్ర‌లు బాగా న‌ప్పుతాయ‌ని అన్నారు. అది ఆయ‌న గొప్ప‌త‌నం. దేశంలో మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ప్రేక్షకులు థియేట‌ర్స్‌కు వ‌స్తున్నారు. అది ఒకరికొక‌రు ఇచ్చే సాయం. మీరంద‌రూ మాకు ఇచ్చే న‌మ్మ‌కం. థియేట‌ర్స్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

More Related Stories