టాలీవుడ్ లో ప్రజలమనిషి గుమ్మడి నర్సయ్య బయోపిక్



Gummadi Narsaiah
2021-03-12 17:54:57

ప్రస్తుతం బయోపిక్ ల జోరు నడుస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల బయోపిక్స్ రాగా మంచి విజయం సాధించాయి. ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ లు కూడా మంచి విజయం సాధించాయి. ఇక ఇప్పుడు తెలంగాణ నుండి మరో ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ రాబోతునట్టు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు ఖమ్మం జిల్లాలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన గుమ్మడి నర్సయ్య బయోపిక్. కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా ఐదు సార్లు గెలిచిన గుమ్మడి నర్సయ్య మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఆయన తన నియోజకవర్గం నుండి బస్సులో అసెంబ్లీకి వచ్చి మిగతా ఎమ్మెల్యే లకు ఆదర్శంగా నిలిచారు. ఈనేపథ్యంలో ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించాలని అనుకున్నారట. ఈ సినిమాను పరమేశ్వరన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతునట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకోసం రీసెర్చ్ కూడా మొదలు పెట్టినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వగానే సినిమా కు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
 

More Related Stories