బిగ్‌బాస్ 5 : ప్రియను ముద్దుల‌తో ముంచేత్తిన హ‌మీద‌.. కార‌ణ‌మదేనా !bigg boss
2021-09-10 12:02:02

బిగ్ బాస్ ఐదో సీజ‌న్ చాలా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ రియాల్టీ షోలో రోజుకో హంగామా జరుగుతుంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లతో షో రసవత్తరంగా సాగుతుంది. మొద‌టి రోజు నుంచే కంటెస్ట్ంట్స్ అంద‌రూ నానా ర‌చ్చ చేస్తున్నారు. వారి అల్ల‌రి చేష్టాల‌తో షో సందడిగా సాగుతుంది. అలా గురువారం నాలుగో రోజు .. బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్క్ వ‌ల్ల  ఓ కంటెస్టెంట్ నిర్ణయం మరో కంటెస్ట్ంట్ మీద ఎఫెక్ట్ ప‌డింది.   నాలుగో రోజు ఎపిసోడ్‌లో హ‌మీదకు ప‌వ‌ర్ రూం ఉపయోగించుకునే అవ‌కాశం ల‌భించింది. ఈ సమ‌యంలో హమీద తీసుకున్న ఓ నిర్ణయం ప్రియకు ఉహించ‌ని షాక్ ఇచ్చింది.  ఇంత‌కీ ఆ నిర్ణ‌యమేమిటంటే.. 

బిగ్ బాస్ నిర్ణ‌యం మేర‌కు హ‌మీద ఎంచుకునే స‌ద‌రు కంటెస్టెంట్ ఈ సీజ‌న్ మొత్తంలో ఎప్ప‌టికీ , ఏ విధంగానూ  హౌ కెప్టెన్ కాలేరు. దీంతో హమీద ఆలోచించి ప్రియ పేరు చెప్పింది. ఆ నిర్ణయం విన్న ప్రియ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రియాక్ట్ అయ్యారు. తాను ఏం బాధప‌డ‌టం లేద‌నీ, ఎవ్వ‌రో ఒక్క‌రూ పేరు అయితే క‌చ్చితంగా చెప్పాలి కదా! త‌న పేరు చెప్పినందుకు ఫీల్ కావ‌డం లేద‌ని ఎంతో హుందాగా వ్య‌వ‌హ‌రించారు. హౌ స‌భ్యులంద‌రూ ప్రియ ధైర్యానికి  ఫిదా అయ్యారు. ఈ నిర్ణ‌యం ల‌హ‌రి స్పందిస్తూ.. తానైతే కన్నీళ్లు ఆపుకోలేనని, ఏడ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది.  

అనంత‌రం  హమీద,ప్రియలు వాష్‌రూం ద‌గ్గ‌ర మూచ్చ‌టిచ్చారు. ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవడానికి గ‌ల కార‌ణమేమిటో హ‌మీద వివ‌రించింది. ప్రియ గారు చాలా ధైర్య‌వంతురాల‌నీ, తాను అంద‌రికీ ఆద‌ర్శ‌వంతుల‌ని చెప్పుకోచ్చారు. ఓ వేళ‌ ప్రియ బయటకు వెళ్లినా ఎంతో మందిని స్పూర్తి ఇస్తారనీ, అందుకే మీ పేరు చెప్ప‌న‌నీ ప్రియతో హమీద చెప్పుకొచ్చింది. 
అనంత‌రం హ‌మీద మాటల‌కు ప్రియ స్పందిస్తూ..  నా పేరు చెప్పినందుకు కోపమేమి లేద‌ని, నువ్ నా ఫేవరట్ అని ప్రియ చెప్పారు. ఆ మాటలు విన్న హ‌మీద‌ వెంటనే ఎమోషనలయ్యింది. అనంత‌రం ప్రియను హ‌గ్‌, ముద్దుల‌తో ముంచేత్తింది హ‌మీద‌.

More Related Stories