అందాల హింస.. బికినీ వేసి చంపకే అలా హాట్ హాట్ హంసా..actess
2019-10-04 07:43:17

కొంద‌రు హీరోయిన్లుగా ఉన్న‌పుడు అస్స‌లు గుర్తింపు తెచ్చుకోరు. కానీ ఐటం గాళ్స్ గా మారితే మాత్రం మ‌త్తెక్కిస్తుంటారు. హంసానందిని ఈ లిస్ట్ లో ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కెరీర్ కొత్త‌లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా న‌టించినా ఈ బ్యూటీని ప‌ట్టించుకున్న వాడే లేడు. కానీ ఎప్పుడైతే మిర్చి సినిమాలో ఐటం సాంగ్ చేసిందో అప్ప‌ట్నుంచే ఈ భామ జాత‌కం కూడా మారిపోయింది. హంసానందిని లేకుండా మొన్న‌టి వ‌ర‌కు సినిమాలు.. ఐటం సాంగ్స్ చేయ‌లేదు ద‌ర్శ‌కులు. సీన్ క‌ట్ చేస్తే మూడేళ్లుగా ఐటం క్వీన్ గా ఇండ‌స్ట్రీని ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు ఐటం సాంగ్స్ లో అందాలు చూపిస్తూనే ఇప్పుడు ఫోటోషూట్ల‌లోనూ మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. అదేదో స‌న్ బాత్ అంటూ ఆ మధ్య ఆరు బ‌య‌ట ఎండ‌లోనే స్నానం చేస్తూ త‌న అందాల‌తో ఆ సూర్యుడికే చెమ‌ట‌లు ప‌ట్టించింది హంసానందిని. ఇక ఇప్పుడు మ‌రోసారి త‌న‌లోని అందాల‌ను బ‌య‌ట‌పెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. బికినీలో క‌వ్విస్తుంది హంసానందిని. టాప్ యాంగిల్ లో ఈమె అందాలు చూపిస్తూ వ‌చ్చిన ఫోటో ఒక‌టి ఇప్పుడు కుర్రాళ్ల‌ను హింస పెడుతుంది. అలాగే చూస్తూ పోతే అందాల‌తోనే ఉరి వేసేలా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సోకుల‌న్నీ చూసిన త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు హంసానందిని కాదు హింసానందిని అని పెట్టుకోవాల్సిందే..!

 

More Related Stories