అత్తారింట్లో నిహారిక తొలి పుట్టినరోజు..చైతన్య విషెస్Niharika Konidela
2020-12-18 16:23:57

ఎపుడు తల్లి తండ్రులు, సోదరుడుతో పుట్టినరోజు వేడుకలు చేసుకునే నిహారిక తొలిసారి భర్తతో కలిసి తన బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది. మెట్టినింట్లో అడుగుపెట్టాక నిహారిక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తన భార్యకు చైతన్య జొన్నలగడ్డ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. ఇటీవల నిహారిక పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 9న  జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి హడావిడి చేయడం ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది.

More Related Stories