హ్యాపీ బర్త్ డే పూరీజగన్నాథ్Puri Jagannadh
2020-09-28 19:28:14

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పురిజగన్నాథ్ ఈ రోజు తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సంధర్బంగా ఆయనకు అభిమానులు నటీనటులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 1966లో పుట్టిన పూరీ చదువు ముగించుకున్న తరవాత సినిమాల మీద ఉన్న పాషన్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా 2000 సంవత్సరంలో మొదటిసారిగా మెగా ఫోన్ అందుకున్నారు. మొదటి సినిమానే పవర్ స్టార్ తో తియ్యడం, బద్రి సినిమా తియ్యడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో పూరీ తన మార్క్ వేసుకున్నాడు. ఇక ఆ తరవాత బాచి సినిమా తీసినప్పటికీ అది అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. కాగా రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మళ్ళీ ట్రాక్ లో పడ్డ పూరీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ్,ఇడియట్, శివమణి లాంటి హిట్లు కొట్టి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ తరవాత పూరి తన కెరీర్ లో మళ్ళీ వెనక్కి చూడలేదు. మహేష్ బాబు తో పోకిరి సినిమా తీసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. మరోవైపు రవితేజతో నేనింతే సినిమా తీసి నంది అవార్డును సైతం అందుకున్నాడు. ఇక గతేడాది పూరి రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం పురిజగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

More Related Stories