బాబోయ్ జూనియర్ ఎన్టీఆర్ తో చాలా కష్టం అంటున్న సమంత..ntr
2019-09-25 22:18:55

పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది సమంత. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా మంచు లక్ష్మి షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కు ముఖ్య అతిథిగా వచ్చింది సమంత. అక్కడ తనకు నచ్చిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఈ సందర్బంగా తనతో నటించిన హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అనే ప్రశ్న వేసింది లక్ష్మి. దానికి మరో ఆలోచన లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే సమాధానం చెప్పింది సమంత. ఆయనతో డాన్స్ చేయడం అంటే చాలా కష్టం.. తారక్ ఎనర్జీ మ్యాచ్ చేయడం కంటే కష్టమైన పని మరోటి ఉండదంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఈమె చెప్పిన ఆన్సర్ తో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోయారు. ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. కాబట్టి ఆ మాత్రం చెప్పడానికి హక్కుంది కూడా. రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలు కూడా మంచి డాన్సర్స్ అయినా కూడా ఎన్టీఆర్ తనకు బెస్ట్ అనిపిస్తాడని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. చెర్రీతో రంగస్థలంలో.. బన్నీతో సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు చేసిన సమంత.. ఎన్టీఆర్‌తో బృందావనం, రభస, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్ లలో నటించింది. ప్రస్తుతం 96 రీమేక్ లో నటిస్తున్న సమంత.. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే బంగార్రాజులో నటించబోతుంది.

More Related Stories