బిగ్ బాస్..అభిజిత్ ను సేవ్ చేసిన హారిక



 Harika
2020-11-23 12:08:41

బిగ్ బాస్ సీజన్-4 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది. పదకొండో వారం హౌస్ నుండి లాస్య నామినేట్ అయింది. ఇక దాంతో సోమవారం పన్నెండో వారం కూడా నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే లీకు వీరులు ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో భయట పెట్టేసారు. ఈ వారం హౌస్ లో నుండి అఖిల్ ,మోనాల్ గజ్జర్ , అవినాష్ , అరియనా లు నామినేషన్ లో ఉన్నట్టు లీక్ అయ్యింది. ఇదిలా ఉండగా గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నామినేషన్ ప్రక్రియ అయినా...హౌస్ లో ఇచ్చే టాస్కులు అయినా కొంతమందికి ఫెవర్ చేసేలా కనిపిస్తున్నాయి. పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ అయిన హారిక కు బిగ్ బాస్ ఎలిమినేషన్ నుండి ఒకరిని కాపాడే పవర్ ఇచ్చారట. దాంతో హారిక తన బెస్ట్ ఫ్రెండ్ అభిజిత్ ను సేవ్ చేసిందని తెలుస్తోంది. ఇక లీకు వీరులు ఇలా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న అన్ని సంఘటనలను లీక్ చెయ్యడంతో ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 పై చాలామంది ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోయినట్టు కనిపిస్తోంది. దాంతో షో రేటింగ్ కూడా చాలావరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ హోస్ట్ నాగార్జున మాత్రం ప్రతి వారం వచ్చి రేటింగ్ ఎక్కడికో పోయిందని చెప్పడం గమనార్హం.

More Related Stories