పవన్ సినిమాలో హీరోయిన్ విషయంలో హరీష్ క్లారిటీpawan
2020-04-19 18:25:58

గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసేశారు. పింక్ రీమేక్ లో లాయర్ గా, క్రిష్ సినిమాలో దొంగగా  నటిస్తున్న పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఎంత ఘాటుగా, నాటుగా ప్రెజెంట్ చేస్తాడా అని అప్పుడే చాలా అంచనాలు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో తేరి రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ మైత్రి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది. హరీష్ పవన్ ఫ్యాన్ కావడంతో సినిమా రికార్డుల మోత మోగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఇక హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటి పూజాహెగ్డే ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. అది పవన్ సినిమా కోసమే అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం మీద హరీశ్ శంకర్ స్పందించాడు. ‘ప్రస్తుతం నేను స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాను. ఇంతవరకూ ఏ హీరోయిన్ ను సంప్రదించలేదు ఎవరినీ ఖరారు చేయలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాతనే హీరోయిన్ ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు ఆయన. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  

 

More Related Stories