ట్రెండింగ్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న హరీష్ శంకర్



 harish shankar
2021-05-27 19:24:54

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లకు కూడా క్రేజ్ పెరుగుతోంది. ఓటీటీ లలోనే కాక యుట్యూబ్ లోనూ వెబ్ సిరిస్ లను విడుదల చేసి యంగ్ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదలైన ఓ వెబ్ సిరీస్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 30 వెడ్స్ 21 అనే కొత్త కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ను యూట్యూబ్ లో విడుదల చేసారు. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ నుండి నాలుగు పార్ట్ లను పను విడుదల చేయగా వాటికి మిలియన్స్ లో వ్యూవ్స్ వచ్చాయి. మరో రెండు పార్ట్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 30 ఏళ్ళ యువకుడు 21 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వారి కాపురం ఎలా ఉంటుందన్నదే ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండటం..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సిరీస్ కు ఎంతోమంది దగ్గరయ్యారు. 

అయితే ఈ వెబ్ సిరీస్ కథ మొదట తన దగ్గరకే వచ్చిందని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. కానీ 30 ఏళ్ళ వ్యక్తి 21 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కామన్ అని ప్రస్తుతం మన తల్లి తండ్రులను చూస్తే కొంతమందికి 15 ఏళ్ల గ్యాప్ కూడా ఉంటుందని..కాబట్టి వర్కౌట్ అవ్వదని అనుకున్నట్టు తెలిపారు. దాంతో తాను నో చెప్పానని అన్నారు. కానీ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ విడుదలయ్యాకే మంచి సక్సెస్ సాధిస్తుందని భవించినట్టు తెలిపారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ..ఈ సిరీస్ మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

More Related Stories