బండ్ల గణేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్Harish Shankar
2020-05-15 18:59:45

గబ్బర్ సింగ్ దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ - బండ్ల గణేష్ ల మధ్య రేగిన వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. మొన్న  మే 11కి గబ్బర్ సింగ్ రిలీజయి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమాకి పని చేసిన అందరికీ కృతఙ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఒక లెటర్ విడుదల చేసాడు. అయితే ఆ లెటర్ లో నిర్మాత బండ్ల గణేష్ పేరు మరియు హీరోయిన్ శృతిహాసన్ పేర్లు మాత్రం ఎందుకో ప్రస్తావించ లేదు. దానికి ప్రత్యేకంగా ఏవయినా కారణాలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఆయన మాత్రం ఆ ఇద్దరి పేర్లు ప్రస్తావించలేదు. దీంతో బండ్ల గణేష్ కి కోపమొచ్చింది. ఈ విషయం మీద ఎవరో ఆయనను వివరణ ఆడినట్టు ఉన్నారు. అయితే ఆయన ఈ కామెంట్స్ చేసినట్టు ఎక్కడా రాలేదు కానీ ఆయన కొన్ని కామెంట్స్ చేశాడని ప్రచారం అయితే జరిగింది. 

ఆ ప్రచారం ప్రకారం ''హరీష్ శంకర్ ని పవన్ కి పరిచయం చేసింది నేను, ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి కూడా సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో ఉంటే పిలిచి మరీ అవకాశం వచ్చేలా చేశానని, 'మిరపకాయ్' సినిమాని పవన్ కళ్యాణ్ - హరీష్ కాంబోలో తీయాలని అనుకున్నా వర్క్ అవుట్ అవ్వలేదని ఒకానొక సమయంలో ఎలాంటి ఛాన్సెస్ లేక డిప్రెషన్ లో ఉన్న హరీష్ 'గబ్బర్ సింగ్' లోకి వచ్చాడని కానీ ఆయన నన్ను మర్చిపోవడం ఆయన సంస్కారమని గణేష్ పెర్కొన్నాడని అంతేకాక హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలడని.. హరీష్ శంకర్ డైరెక్ట్ స్ట్రైట్ సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరిగింది. 

హరీష్ కూడా ఈ విష్యం మీద గట్టిగా స్పందించాడు. గబ్బర్ సింగ్ ఆఫర్ పవన్ కల్యాణ్ ఇచ్చారన్న ఆయన మొదట ఈ సినిమాను నాగబాబు నిర్మించాలనుకున్నారని అనుకోకుండా అది బండ్ల గణేష్ కి వెళ్లిందని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఏంటి.. ఎవరింటికి ఎవరు వెళ్లారో.. ఎవరు ఏమి చేస్తామన్నారో అందరికీ తెలుసన్న హరీష్ క్రెడిబులిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసుకోనని అన్నారు. చిన్న చిన్న కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోనన్న ఆయన హడావిడిలో నా ట్వీట్ లో బండ్ల గణేష్ పేరు మర్చిపోయా కానీ ఆ తర్వాత నా తప్పు తెలుసుకొని ట్వీట్ చేశానని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారట. ఈ యుద్ధం ఎండాకా వెళ్తుందో చూడాలి మరి. 
 

More Related Stories