ఫిదా నటుడు హర్షవర్ధన్ కు కరోనా Harshvardhan Rane
2020-10-06 21:51:09

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటికే పలువురు నటి,నటులు కరోనా బారిన పడి కొలుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా కూడా తాజాగా కోలుకున్నారు. మరోవైపు కరోనా ఇండస్ట్రీలో విషాదాన్ని సైతం నింపింది. ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి మరణించారు. 

ఇక తాజాగా నటుడు హర్షవర్ధన్ రానే కరోనా బారిన పడ్డారు. రానే బాలీవుడ్ తో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించారు. హర్షవర్ధన్ తెలుగులో ఫిదా, అవును సినిమాల్లో నటించారు. కరోనా పాజిటివ్ రావడంతో రానే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తనకు కరోనా వచ్చిన విషయాన్ని రానే ట్విట్టర్ లో వెల్లడించారు. "నాకు జ్వరం మరియు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్ళాను అక్కడ కోవిడ్ పరీక్ష చేయడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో 10రోజులు ఐసోలేషన్ లో ఉన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది." అంటూ హర్షవర్ధన్ పేర్కొన్నారు. హర్షవర్ధన్ కు కరోనా రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

More Related Stories