మైనర్ ను పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరో..hero arjun
2020-03-23 20:26:50

పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే కొన్నిసార్లు హద్దులు మీరుతుంటారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో కూడా తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఆయన మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగు ప్రేక్షకులకు ఈయనతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో నటించిన అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఇప్పుడు ఈయన తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈయన నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా 32 ఏళ్ల కింద.. పెళ్లి చేసుకునే సమయంలో నివేదిత మైనర్ కావటం గమనార్హం. ఇదే విషయాన్ని ఇప్పుడు మీడియాతో చెప్పాడు అర్జున్. 

రూపతార అనే కన్నడ సినిమా మ్యాగజైన్ లో నివేదిత ఫోటోను తొలిసారి చూస్తానని చెప్పాడు అర్జున్. అప్పటికే ఆమె హీరోయిన్  కావడంతో ఈ అమ్మాయి బాగుందే అనుకున్నానని.. డాక్టర్ గారి అబ్బాయి అనే తెలుగు సినమాకు ఓకే చెప్పినప్పుడు.. ఆ సినిమాకు నివేదితను రికమండ్ చేశానని చెప్పాడు.. పైగా నివేదిత తండ్రి రాజేశ్ అప్పటికే కన్నడలో పెద్ద స్టార్.. ఆ టైంలో తన నాన్న శక్తి ప్రసాద్ విలన్ గా మంచి పేరుందని చెప్పాడు అర్జున్. వారిద్దరూ మంచి స్నేహితులు.. డాక్టర్ గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడే తనకు.. నివేదితకు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నాడు అర్జున్. ఆ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు సిరింజి చేతికి గుచ్చుకొని చేయి మొత్తం చీలిపోయిందని.. ఆసుపత్రికి వెళితే కుట్లు వేసారని.. అప్పుడు ఆమె కళ్ళలో కన్నీరు కనిపించిందని చెప్పాడు. 

ఆ రోజు నుంచే ఫీలింగ్ స్టార్ట్ అయ్యిందని.. అప్పుడే తనను పెళ్లి చేసుకోమని అడిగినట్లు గుర్తు చేసుకున్నాడు అర్జున్. తన పెళ్లి జరిగినప్పుడు తన వయసు పాతికేళ్ళు అయితే ఆమె వయసు 17 సంవత్సరాలు అని.. అప్పటికి ఆమె ఇంకా మైనర్ అని చెప్పాడు. ఏదైనా సినిమాలో తను ఒక హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ అయితే తట్టుకునేది కాదని చెప్పాడు అర్జున్. అయితే తర్వాత తర్వాత మెల్లగా అర్థం చేసుకొని తనతో కలిసి పోయిందని తన భార్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ హీరో. 

More Related Stories