విజయ్ మరో సంచలన నిర్ణయం..తండ్రికి షాక్



Hero Vijay
2020-11-12 12:44:43

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ స్థాపించిన రాజకీయపార్టీలో తాను చేరడం లేదని విజయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన సంఘం "విజయ్ మక్కల్ ఇయక్కం " నుండి తన తండ్రి చంద్ర శేఖర్ మద్దతు దారులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చెన్నై, తిరుచ్చి,  మధురై జిల్లాల అభిమాన సంఘం అధ్యక్షులను సైతం తొలగించారు. అంతే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న తన తండ్రి సానుభూతి పరులను, మద్దతు దారులను తొలగించారు. 

విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తల నేపథ్యంలో "విజయ్ మక్కల్ ఇయక్కం" అభిమాన సంఘంతో చర్చించి తాను రాజకీయాల్లోకి రావట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఎన్నో సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన రచయితగా కూడా చేస్తున్నారు. చంద్రశేఖర్ మాత్రం విజయ్ ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని..విజయ్ త్వరలోనే నిజాలు తెలుసుకుంటాడని చెప్పుకొస్తున్నాడు. అంతే కాకుండా తండ్రీ కొడుకులు అన్నాక మనస్పర్థలు కామన్ అని అంటున్నారు. మరోవైపు ఇదే విషయంపై విజయ్ తల్లిని సంప్రదించగా ఆమె సైతం పార్టీలో చేరలేదని చెప్పింది. విజయ్ తన తండ్రితో మాట్లాడటం లేదని కూడా స్పష్టం చేసింది. ఇక సినిమాను తలపించేలా ఉన్న విజయ్ పొలిటికల్ డ్రామా ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.

More Related Stories