దిల్ రాజుకే చుక్కలు చూపిస్తున్న ఆ హీరోయిన్.. shalini pandey
2019-10-17 11:55:09

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజును మించిన నిర్మాత ఎవరూ లేరు. ఆయన ఏది అనుకుంటే అది చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే రూలర్. అలాంటి దిల్ రాజును ఇప్పుడు ఒక హీరోయిన్ ఇబ్బంది పెడుతుందని ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు అర్జున్ రెడ్డి ఫిలిమ్ శాలిని పాండే. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఇద్దరి లోకం ఒకటే సినిమాలో నటిస్తుంది ఈమె. దాంతో పాటు అనుష్క హీరోయిన్ గా తెరకెక్కుతున్న నిశ్శబ్ధం సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది శాలిని పాండే. తమిళనాట కూడా రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు చేసినా కూడా ఈమెకు పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. అర్జున్ రెడ్డితో వచ్చిన ఇమేజ్ సరిగ్గా బాలన్స్ చేసుకోవడంలో విఫలమైన షాలిని పాండే.. చిన్న సినిమాలతో కాలం గడిపేస్తుంది. ఇలాంటి సమయంలో తెలుగులో దిల్ రాజు ఆఫీస్ నుంచి ఆఫర్ రావడం అనేది చిన్న విషయం కాదు. రాజ్ తరుణ్ సినిమాలో పిలిచి మరీ అవకాశం ఇస్తే ఈమె మాత్రం సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతుందని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ సినిమా కోసం రాజ్ తరుణ్ సినిమాను పక్కన పెట్టేసిందని.. అడిగిన సమయంలో డేట్లు ఇవ్వడంలో శాలిని పాండే విఫలమవుతోందని.. ఆమె తీరుపై దిల్ రాజు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దిల్ రాజుకే ఇలాంటి చుక్కలు చూపిస్తే సాధారణ నిర్మాతల పరిస్థితి ఏంటి అంటూ శాలిని పాండేపై విమర్శల వర్షం కురుస్తుంది. శాలిని ఇచ్చిన డేట్స్ ఆధారంగా చేసుకుని ఇద్దరి లోకం ఒకటే షూటింగ్ జరుగుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కంటిన్యూ అయితే తెలుగులో షాలిని పాండేకు ఇదే చివరి సినిమా అవుతుంది. 

More Related Stories