హీరోలుగా మొదలుపెట్టి.. కారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయి..Allari Naresh
2019-12-26 16:58:30

హిట్ రాన‌పుడు.. మార్కెట్ లేన‌పుడు కూడా హీరోగా న‌టిస్తానంటే కుద‌ర‌దు. సినిమా అంటే కోట్ల‌తో చేసే వ్యాపారం. క‌చ్చితంగా హిట్స్ వ‌చ్చిన‌పుడే అవ‌కాశాలు కూడా వ‌స్తాయి. కానీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు కుర్ర హీరోలు మాత్రం ఇప్పుడు త‌మ సిచ్యువేష‌న్ అర్థం చేసుకుని కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు అది చేసారు.. ఇప్పుడు వార‌సులు కూడా ఇదే చేస్తున్నారు. ఈ మ‌ధ్యే అల్ల‌రి న‌రేష్ మ‌హ‌ర్షి కోసం కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. మ‌హేశ్ బాబు స్నేహితుడి పాత్ర‌లో న‌టించాడు న‌రేష్. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు న‌రేష్. మ‌హ‌ర్షి త‌ర్వాత వ‌ర‌స అవ‌కాశాలు వ‌స్తున్నాయి ఈయ‌న‌కు. ఇప్పుడు మరో ప్రముఖ హీరో సినిమాలో కూడా అల్ల‌రి న‌రేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు హీరోగానూ ట్రై చేస్తున్నాడు ఈయన. ఇక ఈయ‌న‌తో పాటు ఇప్పుడు సుశాంత్ కూడా ఇదే చేస్తున్నాడు. అక్కినేని మేన‌ల్లుడు కూడా ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. త్రివిక్ర‌మ్, బ‌న్నీ సినిమాలో ఈయ‌న ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు. బ‌న్నీ సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసాడు సుశాంత్. వ‌ర‌స ఫ్లాపుల త‌ర్వాత హీరోగా కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ట్రై చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. దాంతోపాటే ఇక్కడ వాహనములు నిలపరాదు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక నవదీప్, ఆర్యన్ రాజేష్ లాంటి ఒకప్పటి హీరోలు కూడా ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయారు. మొత్తానికి వ‌ర‌స ఫ్లాపుల త‌ర్వాత ఈ కుర్ర హీరోలు తీసుకున్న నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌.

More Related Stories