హిట్ నాలుగు రోజుల కలెక్షన్స్..డ్రాప్ ఉన్నా సరేHit movie
2020-03-04 17:25:16

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన రెండో సినిమా హిట్. ఫలక్నామా దాస్ సినిమాతో మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ లాంటి సినిమాల్లో నటించినా రానంత క్రేజ్ ఈ సినిమాతో వచ్చేసింది. చాలా సైలెంట్ గా అతను నటించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

 సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్, స్నిక్ పీక్ లతో హిట్ చిత్రంపై అందరిలోనూ ఈ సినిమా మీద ఆసక్తి కలిగింది. అదే ఆసక్తి జనాన్ని థియేటర్ లకి రప్పించింది. తొలి వీకెండ్ మొత్తం ఇదే ఈ సినిమా దుమ్ము దులిపింది. అలాగే సినిమా విడుదలయిన మూడో రోజు అంటే ఆదివారం మొదటి రోజు కంటే వసూళ్లు ఎక్కువ నమోదవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 

తొలి వీకెండ్ లో 3.57 కోట్ల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఈ సినిమా సోమవారం నాడు మాత్రం డ్రాప్ అయింది. దాదాపుగా అన్ని చిన్న సినిమాలకు వీక్ డే అయిన సోమవారం నాడు డ్రాప్స్ ఉంటాయి. హిట్ కూడా 50 శాతం మేర డ్రాపయింది. అయినా నాలుగు రోజులకు ఈ సినిమా 4 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం విశేషం. 

More Related Stories