లైగర్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్



Vijay devarakonda
2021-04-06 17:56:35

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో విజయ్ కి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తరవత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తరవాత గీత గోవిందం సినిమాతో యూత్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా "లైగర్ " లో నటిస్తున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మరియు ఛార్మీ కౌర్ లు కలిసి ధర్మా మూవీస్, పూరికెనెక్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాలో స్టెంట్ మాస్టర్ గా యాండి లాంగ్ వ్యవహరించబోతున్నారు. యాండి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు స్టెంట్ మాస్టర్ గా పనిచేసారు. ముఖ్యంగా జాకీ ఛాన్ తో కలిసి పని చేశారు. ఇక లైగర్ లో ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో చూడాలి.

More Related Stories