నిహారిక కు నాగబాబు ఇచ్చే కట్నం ఇదేNagababu
2020-11-20 18:00:22

నాగబాబు గారాల కూతురు నిహారిక కు గుంటూరు ఐజి కుమారుడు చైతన్యకు కరోనా లోక్డౌన్ తరువాత అతి కొద్దిమంది కుటుంబసభ్యుల మధ్య ఆగెస్ట్ నెలలోనే ఏంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో పెళ్లి మూహర్తం కూడా ఖరారైంది. వారి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్న వేల మెగా అల్లుడికి  కట్నకానుకలు ఎంత ఇస్తున్నారు అనే విషయం మీద జనాలకు ఆశక్తి పెరిగింది. కట్నం అనేది చట్టరీత్య నేరం అయినప్పటికీ ప్రతి అమ్మాయి తల్లి తండ్రులు తమ స్తోమతలో అంతో కొంత డబ్బు రూపంలోనో లేక ఆస్తి రూపంలోనో ఇస్తూ ఉంటారు. కానీ సెలబ్రెటీస్ పెళ్లిలో వరకట్నం మాట ఎక్కువగా వినిపించదు వారు ఎక్కువగా ఆస్తుల రూపంలో వరకట్నాన్ని ఇస్తూవుంటారు. 

అలాగే నాగబాబు తన గారాల పట్టి  నిహరికకు కూడా కట్నం కింద దాదాపుగా ఇరవై అయిదు కోట్ల వరకు ముడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది డబ్బు రూపంలో కాకుండా నిహారిక పేరు మీద ఉన్న ఆస్తుల విలువగా తెలుస్తుంది. నిహారిక పేరుమీద ఒక బంగ్లా,కొన్ని ఫ్లాట్ లు ఉన్నాయని .వాటితో పాటు బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ఇచ్చే కానుకలు కూడా చైతన్యకు వస్తాయి వీటి మొత్తం విలువ ఇరవై అయిదు కోట్లు వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చైతన్య కుటుంబానికి కూడా గుంటూరు లో బాగానే ఆస్తులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

More Related Stories