మరోసారి బాలయ్యని టార్గెట్ చేసిన హైపర్ ఆది.. Hyper Aadi
2020-06-26 07:35:04

చాలా రోజుల తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపించాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. మూడు నెలల విరామం తర్వాత ఈ మధ్య మళ్ళీ షో మొదలైంది. దాంతో మళ్లీ తన పెన్ కు పదును పెట్టాడు ఈ కమెడియన్. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో బాలకృష్ణను మరోసారి టార్గెట్ చేశాడు హైపర్ ఆది. గతంలోనే బాలయ్య మీద చేసిన ఒక స్కిట్ చాలా బాగా పేలింది. అయితే ఆ సమయంలో బాలకృష్ణ అభిమానులు హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది. మరోసారి బాలయ్యను టార్గెట్ చేసి పిచ్చి పిచ్చి స్కిట్లు చేస్తే కచ్చితంగా తాట తీస్తాం అంటూ అప్పట్లో వార్తలు బాగానే వినిపించాయి. దీనిపై హైపర్ ఆది మాట్లాడుతూ అలాంటిదేం లేదని కొట్టిపారేశాడు. 

తాను జబర్దస్త్ లో ఏం చేసినా కూడా కామెడీ కోసమే అంటూ.. 10 మందిని నవ్వించడానికి ఏం చేసినా తప్పు లేదు అంటున్నాడు ఈ కమెడియన్. ఈ దారిలోనే తాజాగా మరోసారి బాలకృష్ణ డైలాగ్ ను తన స్కిట్ కోసం వాడుకున్నాడు. ఈ మధ్య బాలకృష్ణ బర్త్ డే కానుకగా బోయపాటి శ్రీను విడుదల చేసిన టీజర్ లో ఎదుటి వాళ్లతో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. దాన్ని తనకు తగ్గట్లుగా మార్చుకున్నాడు హైపర్ ఆది. రైజింగ్ రాజుతో ఈ డైలాగ్ చెప్పించాడు ఆది. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారు మా జంటను చూసి కుళ్ళుకుంటున్నారు అనడానికి.. కుళ్ళిపోయిన మీ జంటను చూడడానికి.. అనడానికి చాలా తేడా ఉంది అంటూ హైపర్ ఆది సెటైర్ వేసాడు. ఇది ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. అనవసరంగా ఎందుకు బాలకృష్ణతో పెట్టుకుంటావు అంటూ అభిమానులతో పాటు నెటిజన్స్ ఆయనకు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ తాను మాత్రం కామెడీ కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్తున్నాడు

More Related Stories