ఆ సినిమాలు హిట్టయ్యుంటే టాలీవుడ్ రేంజ్ మారేదంటున్న నాగ్ అశ్విన్..



nag
2019-09-08 19:36:31

బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నారు.. ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు రాజమౌళి. ఈ చిత్రం తర్వాత అదే లెగసీని సాహో, సైరా లాంటి సినిమాలు కంటిన్యూ చేస్తున్నాయి. అయితే గతంలో వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయ్యుంటే మాత్రం ఇప్పటికే మన తెలుగు సినిమా రేంజ్ మరోలా ఉండేదంటున్నాడు నాగ్ అశ్విన్. మహానటితో నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఈ కుర్ర దర్శకుడు.. తన ట్విట్టర్ లో ట్విస్ట్ ఇచ్చాడు. ఈయన కొన్ని సినిమాల పేర్లు చెప్పి.. ఇవి కానీ ఆడుంటే మన రేంజ్ మరోలా ఉండేదని చెప్పాడు. ఈయన చెప్పిన సినిమాలు కూడా అదిరిపోయాయి. ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్.. ఒకవేళ ఈ సినిమాలు కానీ హిట్ అయ్యుంటే తెలుగు సినిమా రేంజ్ మరోలా ఉండేదని చెప్పాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ కాలేదని.. కానీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం నిలిచిపోయాయని చెప్పాడు నాగ్ అశ్విన్. ఆయన చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఖలేజా సినిమాలో మహేష్ బాబు డైలాగ్ డెలవరీ అద్భుతం. కానీ ఆ సమయానికి అది వర్కవుట్ కాలేదంతే. కానీ టీవీల్లో మాత్రం ఖలేజా బ్లాక్ బస్టర్. చివరగా తన ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఆపద్బాంధవుడు సినిమాని కూడా ఈ లిస్ట్ లో చేర్చాడు నాగ్ అశ్విన్. ఈ కుర్ర దర్శకుడు చెప్పిన కొన్ని సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదంతే. మొత్తానికి కొత్త కథలు ఇప్పుడు బాగానే వర్కవుట్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు ఆ క్రేజ్ లేక ఇవన్నీ పోయాయంటున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories