నా బాయ్ ఫ్రెండ్ ఇతడే..ఫోటో షేర్ చేసిన ఇలియానాIleana DCruz
2021-03-03 17:10:32

గోవా బ్యూటీ ఇలియానా దేవదాస్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇలియానా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరవాత బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ గడిపేస్తుంది. ప్రస్తుతం ఇలియానా "అన్ ఫెయిర్ అండ్  లవ్లీ" అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో ముచ్చటించింది. 

కాగా ఓ నెటిజన్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ ఇలియానాను ప్రశ్నించాడు. దానికి ఇలియానా సమాధానమిస్తూ..తన పెంపుడు కుక్క "చార్లీ" ఫోటో పెట్టి నెటిజన్ కు షాక్ ఇచ్చింది. అంతే కాకుండా మరో నెటిజన్ మీరు ఎప్పుడైనా అందంగా ఉండటానికి సర్జరీ చేసుకున్నారా అని ప్రశ్నించారు. దానికి ఇలియానా సమాధానమిస్తూ...ఒకప్పుడు నేను సన్నగా ఉండాలని అనుకునేదాన్ని..నా ముక్కు కొంచెం కొచ్చేగా ఉంటే బాగుండని అనుకునే దాన్ని..ఇంకా కొంచెం పొడవు ఉండి ఉంటే ఇంకా బాగుండేదాన్ని అని భావించేదాన్ని కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలేమి లేవు..నేను నాకు ఉన్న లోపాలతోనే హ్యాపీగా ఉన్నా. అంటూ గోవా బ్యూటీ సమాధానం ఇచ్చింది.

More Related Stories