సీనియర్ హీరోతో జత కట్టేందుకు రెడీ అవుతున్న ఇల్లీ బేబీ Ileana
2020-07-31 19:08:04

ఇల్లీ బేబీ నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. దేవదాసు సినిమా ద్వారా పరిచయమై పోకిరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. ఆ మధ్యన ఫారిన్ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నటి ఇలియానా సినిమాల్ని, సోషల్ మీడియాని సైతం పట్టించుకోలేదు. అయితే  ప్రియుడితో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్లి బాగా బరువు పెరిగి ఇప్పుడు ఆ రచ్చ నుండి బయటపడేందుకు తనకెంతో ఇష్టమైన గ్లామర్ ఫీల్డ్ లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం తన హాట్ ఫొటోలును బయటకు వదిలి వేడి రేపుతోంది. 

ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనితో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చినా అది డిజాస్టర్ అయింది. లాక్ డౌన్ వలన ఇంటికే పరిమితమయిన ఇలియానా తన ఫిట్ నెస్ మీద ద్రుష్టి పెట్టి నట్టు చెబుతున్నారు. తాజాగా అందుతున్న  సమాచారం మేరకు ఈ గోవా భామ నాగార్జునతో జోడీ కట్టబోతున్నదని చెబుతున్నారు. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా ఖరారైందని అంటున్నారు. చూడాలి ఇది ఎంత వరకూ నిజం అవుతుందనేది.

More Related Stories