అల్లు అర్జున్, మహేష్ ఫేక్ రికార్డులపై సెటైర్లు..mb
2020-01-28 12:24:28

సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై ఫేక్ రికార్డులు వేస్తున్నారని ముందు నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే నిజం అంటున్నారు కొందరు నెటిజన్స్. దానికి సాక్ష్యలు కూడా చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు సినిమాకు అయితే దారుణంగా ఫేక్ రికార్డులు వేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు గొప్ప సినిమాలేం కాదు. ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది కానీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే కాదు. కానీ పండగ సీజన్ కావడంతో రెండూ కలెక్షన్లు అద్భుతంగా తీసుకొచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా అయితే ఒకింత మంచి వసూళ్లనే తీసుకొచ్చింది. అయితే వాళ్లు ప్రమోట్ చేస్తున్న స్థాయిలో గొప్ప సినిమా అయితే కాదు. సగటు ఫ్యామిలీ సినిమా అంతే. దానికి తోడు పండగ సీజన్ కావడంతో మంచి వసూళ్లు తీసుకొచ్చింది.. ఇంకా తీసుకొస్తుంది. అన్నింటికి మించి దీనికి థియేటర్స్ భారీ సంఖ్యలో వచ్చాయి. అల్లు అరవింద్ ఉండటంతో మూడు వారాలు అవుతున్నా కూడా ఇంకా చాలా థియేటర్స్ లో అల వైకుంఠపురములో ఉంది.

అందుకే కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. 100 కోట్లకు పైగానే రావడంతో ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి అంటూ ప్రమోషన్స్ మొదలైపోయాయి. బన్నీ అయితే ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉందంటూ మీడియా ముందే చెప్పుకొచ్చాడు. అత్తారింటికి దారేది కంటే మంచి సినిమాగా దీన్ని అభివర్ణించారు. అయితే నిజానికి అల వైకుంఠపురములో సినిమాకు అంత సినిమా ఏం లేదంటున్నారు విశ్లేషకులు. ఫ్యామిలీ సినిమా కావడం.. పండక్కి మరే సినిమా లేకపోవడంతో అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అయిందంటున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు పరిస్థితి అయితే మరోలా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయింది. 100 కోట్లకు పైగా షేర్ అయితే తీసుకొచ్చింది. కానీ చిత్రయూనిట్ మాత్రం మాది బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఫేక్ రికార్డుల వైపు మహేష్ పరుగులు తీస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాలకే ఈ స్థాయిలో రచ్చ చేస్తుంటే.. మరి బాహుబలి లాంటి సినిమాలకు ఏ స్థాయిలో డప్పు కొట్టుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో..? ఏదేమైనా కూడా సాధారణ సినిమాలకే ఈ స్థాయి ప్రమోషన్ అవసరం లేదేమో..? కాకపోతే ఇండస్ట్రీలో ఎవరి డప్పు వాళ్లే కొట్టుకోవాలి కాబట్టి తప్పదు.

More Related Stories