మహేష్ త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్



 Mahesh Babu
2021-05-04 14:16:27

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారువారిపాట సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు ప‌రషురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ కు ప్ర‌స్తుతం బ్రేక్ ప‌డింది. ఇదిలా ఉండ‌గానే మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమాను ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు త‌మన్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న‌ట్టు తెలుస్తుంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలుబ‌డ‌లేదు. 

అయితే తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాకు పార్దు అనే టైటిల్ ను అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఈ టైటిల్ ను త్రివిక్ర‌మ్ అత‌డు సినిమా నుండి తీసుకున్నార‌ట‌. అత‌డు సినిమాలో మ‌హేశ్ బాబు పేరు పార్దసార‌థి కాగా ముద్దుగా పార్దు అని పిలుచుకుంటారు. అత‌డు సినిమాలో ఈ పేరు ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. దాంతో త్రివిక్ర‌మ్ ఈ పేరునే టైటిట్ గా అనుకుంటున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గానే ఈ సినిమాలో మ‌హేశ్ బాబు రా ఏజెంట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టుగా గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే. 
 

More Related Stories