ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ సూపర్ స్టార్ కూతురుIra Khan
2020-11-25 11:28:02

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ మరోసారి ప్రేమలో పడింది. గతంలో ఇరా ఖాన్ మిషాల్ కృపలానిని తో ప్రేమాయణం నడిపించింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఏడాది క్రితం వీరద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇరా ఖాన్ ప్రస్తుతం తన తండ్రి అమీర్ ఖాన్ ఫిట్నెస్ కోచ్ నూపూర్ షికారే తో లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నూపూర్ షికారే గత పదేళ్లుగా అమీర్ ఖాన్ కు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. అతడు చాలా నైపుణ్యం గల ఫిట్నెస్ ట్రైనర్ అని టాక్ కూడా ఉంది. గతంలో నూపూర్ షికారే సుస్మిత సేన్ కి కూడా ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరించారట. 

ఇక అమీర్ కు నూపూర్ షికారే ట్రైనర్ గా వ్యవహరిస్తున్న క్రమంలోనే ఇరా కు అతడితో పరిచాయం ఏర్పడిందట. ఇప్పుడు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. గతంలో ఇరా ప్రేమాయణం వార్తల్లో రావడంతో ఈ సారి చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుతోంది. ఇక ఇటీవల దీపావళి పండగను కూడా ఇరాఖాన్ తన ప్రియుడు  నూపూర్ షికారే తోనే జరుపుకుంది. దివాలి సెలెబ్రేషన్స్ కి ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇరా తన ప్రేమ వ్యవహారాన్ని ఇప్పటికే తన తల్లి రీనా దత్తాకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈసారైనా అమీర్ ఖాన్ కూతురి ప్రేమ పెళ్లివరకూ వెళుతుందా చూడాలి.

More Related Stories