ఆర్జీవీ డీ కంపెనీకి దావూదే ప్రొడ్యూసర్



Dawood
2021-03-16 17:27:44

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సొంత కథలకంటే ఎక్కువగా యథార్థ సంఘటనలు, జీవిత కథలు ఆధారంగానే ఎక్కువగా సినిమాలు తెరకెక్కస్తుంటారు. ఈనేపథ్యంలో ఆర్జీవి తెరకెక్కిస్తున్న మరో సినిమా ఢీ కంపెనీ. ఈ సినిమాను ఏకంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దావూద్ ఇబ్రహీం నిర్మించారన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ట్రైలర్ లో ప్రొడ్యూసర్ పేరు వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అల్లాహు అక్బర్ అనే మ్యూజిక్ వస్తుంది. 

నిజానికి ఈ చిత్రాన్ని స్పార్క్ మీడియా అధినేత సాగర్ మాచణూరు నిర్మించారు. అయితే తెలుగు ప్రొడ్యూసర్ పేరు రావడం..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధం లేకుండా ఉంది. అంతే కాకుండా ఆర్జివి గతేడాది దుబాయ్ వెళ్ళినప్పుడు దావూద్ ఇబ్రహీం ను కలిసినట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దుబాయ్ లో ఈ సినిమాలో ఏ సన్నివేశాలు హైలెట్ చేయాలి. అన్నదానిపై చర్చలు జరిగినట్టు అనుమానాలు వస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో దావూద్ ను హీరోగా చూపించే ప్రయత్నం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ రహస్య సమావేశం జరిగిన తరవతనే డీ కంపెనీ షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలు వివాదాస్పద సినిమాలు తీసిన ఆర్జీవి ఈ సినిమాతో ఇంకెన్ని వివాదాల్లో చిక్కుకుంటారో చూడాలి.

More Related Stories