తెలుగు ఇండస్ట్రీ అంటే జీవిత రాజశేఖర్ మాత్రమేనా..Jeevitha Rajasekar.jpg
2019-12-06 15:54:57

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. ఏమో ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా కూడా జీవిత-రాజశేఖర్ ముందుగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం వాళ్లే నడిపిస్తున్నట్లు ప్రతి దాంట్లోనూ ముందు కనిపిస్తున్నారు జీవిత రాజశేఖర్. ఆరు నెలల కింద వరకు ఎక్కడా కనిపించని ఈ జంట మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని తామై ముందుకు వస్తున్నారు.

మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ కూడా కొన్నిచోట్ల కనిపించడం లేదు కానీ.. జీవిత రాజశేఖర్ మాత్రం అన్ని చోట్ల కనిపిస్తున్నారు. వీళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు అంటూ ఇప్పటికే మా సభ్యులు కొందరు మీడియా ముందే జీవిత రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మొన్నటికి మొన్న డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి కలిసి వచ్చారు. అయితే అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదు కానీ.. మంచు మనోజ్ వెళ్లి వచ్చిన తర్వాత జీవితా రాజశేఖర్ వెళ్లొచ్చారు. అంటే మనోజ్ వెళ్తే గాని ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లడానికి జీవిత రాజశేఖర్ కు సమయం కుదరలేదు అంటూ కొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఆ తర్వాత కార్తీక మాస వన భోజనాలు కూడా జీవిత రాజశేఖర్ పై సెటైర్లు పడేలా చేశాయి. అప్పట్లో చిరంజీవి మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వనభోజనాలు ఏర్పాటు చేసేవాడు. ఆయన తర్వాత అందరూ మానేసిన సమయంలో ఇప్పుడు సడన్ గా రాజశేఖర్ ఈ సాంప్రదాయానికి మళ్లీ తెరతీశాడు. అంటే ఇండస్ట్రీకి పెద్ద తానే అంటూ ఇండైరెక్టుగా చెప్పుకున్నాడు అంటూ కొందరు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ చేశారు జీవిత రాజశేఖర్ దంపతులు. వాళ్లతో పాటు ఇండస్ట్రీలో పలువురు కలిసారు. అందులో మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ లేడు.

ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో జీవిత-రాజశేఖర్ ప్రతి విషయంలోనూ ఇలా ముందు కనిపించడంతో ఇండస్ట్రీలో తాము మాత్రమే ఉన్నాను అంటూ చెప్పుకోవడానికి కాస్త ఎక్సట్రాలు చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ పెద్దల నుంచి వాళ్లకు చివాట్లు కూడా వెళుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories