పూనమ్ కౌర్ గారూ.. ఆ అబద్దాల కోరు పవన్ కల్యాణ్ అంటారా..Poonam Kaur
2019-10-29 16:43:40

అన్నీ స‌ర్దుకుంటున్నాయి అనుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ ర‌చ్చ లేపుతుంది పూన‌మ్ కౌర్. కావాల‌ని చేసిందో.. లేదంటే నిజంగానే అనిపించిందో ఏమో కానీ ఇప్పుడు ఈమె చేసిన ఒక్క ట్వీట్ సంచలనంగా మారుతుంది. అప్పట్లో క‌త్తి మ‌హేష్ తో వ్య‌వ‌హారం అంతా బాగానే స‌ర్దుకుంటున్న స‌మ‌యంలో పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ రచ్చ చేసింది. ప్రతీ విషయంలోనూ ఈ భామ అన‌వ‌స‌రంగా మ‌ధ్య‌లోకి వ‌చ్చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. త‌న దృష్టిలో పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదని.. ఆయనొక దైవికమైన శక్తి అని.. ఆ శక్తి ముందు ఎవరైనా సరే కరిగిపోవాల్సిందే అంటూ అప్పట్లో పూనమ్ కౌర్ ఓ ట్వీట్ వేసింది. ఇది చూసి మ‌ళ్లీ సోషల్ మీడియాలో ర‌చ్చ బాగానే జరిగింది. కావాల‌నే మ‌ళ్లీ రెచ్చ‌గొడుతుందా అనే అనుమానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ.. లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడు.. అంటూ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇది చూసిన జనం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే చేసిందంటూ ఆమెపై మండిపడుతున్నారు. చివర్లో జస్ట్ ఏ థాట్ (ఓ చిన్నఆలోచన) అని మాత్రమే అంటూ పేర్కొంది. ఈమె ట్వీట్ కాస్త లోతుగా ప‌రిశీలిస్తే.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిందని అర్థమవుతుంది. అంతకుముందు కూడా ఇదే రేంజ్ లో రెచ్చిపోయింది పూనమ్. అయిపోయిన విషయాన్ని మళ్లీ కావాలనే పూనమ్ రెచ్చగొడుతుందని అభిమానులు మండిపడుతున్నారు. పేరు పెట్టకుండా పవన్ ను టార్గెట్ చేయడం వెనక లక్ష్యమేంటో అంటున్నారు ఫ్యాన్స్.

More Related Stories