ఆల్రెడీ శ్రీముఖి పేరు మీద ప్రైజ్ మనీ ఫిక్స్ అయిపోయిందా..sri
2019-11-02 20:59:55

చూస్తూండగానే బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఫైనల్ కూడా జరగబోతుంది. చిరంజీవి సమక్షంలో విన్నర్ అనౌన్స్ మెంట్ జరగనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. బాబా భాస్కర్, అలీ, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఈ ఐదుగురు ఫైనల్ కు చేరుకున్నారు. అయితే ఇందులో బాబా భాస్కర్, అలీ ఇద్దరూ విన్నర్ కుర్చీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. వీళ్లను విజేతగా ప్రకటించే అవకాశం అస్సలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ కూడా బిగ్ బాస్ 3 రేస్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్యలో పోటీ జరుగుతుంది. శ్రీముఖి విన్నర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దానికి తోడు నాగార్జునను గట్టిగా కౌగిలించుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

ఇది చూసిన తర్వాత నిజంగానే శ్రీముఖి విజేత అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరెంతగా ప్రయత్నించినా ప్రైజ్ మనీ ముందే ఫిక్స్ అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బయట అంత బిజీగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసుకుని మరీ శ్రీముఖి బిగ్ బాస్ షో కి వచ్చినప్పుడు ఆమె విజేతగా నిలుస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే జరుగుతుంది కూడా. కచ్చితంగా శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అయి తీరుతుంది అంటూ సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ గా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ కు సపోర్ట్ గా కూడా సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు.

More Related Stories