తరుణ్ భాస్కర్ డైరెక్షన్ మానేస్తున్నాడాIMG-20190907-WA0075
2019-09-07 14:10:00

ఈ త‌రం ద‌ర్శ‌కులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటారో అర్థం కావడం లేదు. అసలే ఇప్పుడు చాలా ముదుర్లు దర్శకులుగా మారుతున్నారు. వచ్చిన తర్వాత ముదుర్లు కావడం కాదు.. ముదుర్లుగా మారిన తర్వాతే ఇండస్ట్రీకి వస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా అందులో ఒకడు. పెళ్లిచూపులుతో ప‌రిచ‌యం అయిన ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్యే ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ వ‌చ్చాడు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయింది. క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అని చెప్పుకుంటున్నా ప్రేక్ష‌కుల దృష్టిలో మాత్రం ఫ్లాపే. అయినా ఏదైనా సినిమా విడుద‌లైన‌పుడు ఎలా ఉంది అని ముందు అడుగుతారు.. ఆ త‌ర్వాత క‌థేంటి అని..? కానీ త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైందికి మాత్రం కేవ‌లం తొలి ప్ర‌శ్న మాత్ర‌మే అడ‌గాలి. ఎందుకంటే ఈ చిత్రంలో క‌థ లేదు.. కేవ‌లం కామెడీ మాత్ర‌మే ఉంది. పెళ్లిచూపులు సినిమాకు ప‌క‌డ్బంధీ క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. తొలి సినిమా కాబ‌ట్టి ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటూ రాసుకున్న స్క్రిప్ట్ అది. అందుకే అందులో ఎమోష‌న్స్ సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంది. కానీ రెండో సినిమాకు వ‌చ్చేస‌రికి అవేవీ లేవు. ఉన్న‌ద‌ల్లా కామెడీ ఒక్క‌టే. ప్ర‌తీ సీన్ ఎలా న‌వ్వించాలి అని మాత్ర‌మే ఆలోచించాడు త‌రుణ్ భాస్క‌ర్. దానికితోడు తెలంగాణ యాస మ‌ళ్లీ పెట్టాడు. అయితే ఏం చేసినా కూడా ఈ న‌గ‌రానికి ఏమైంది బ‌త‌క‌లేదు. దాంతో మూడో సినిమా గురించి ఆలోచించకుండా సింపుల్ గా నటుడిగా మారిపోయాడు ఈయన.

ఫలక్ నుమా దాస్ లో ఇన్స్ పెక్టర్ పాత్రలో నటించిన తరుణ్.. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలో తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా తరుణ్ భాస్కర్ ఇకపై దర్శకుడిగా మాత్రం సినిమాలు చేయడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా నటించాడు ఈయన. మొత్తానికి మరి చూడాలిక.. తరుణ్ భాస్కర్ ను ఏయే దర్శకుడు ఎలా వాడుకోబోతున్నాడో..?

More Related Stories