దుమ్ములేపుతున్న ఇస్మార్ట్ శంకర్ Ismart Shankar
2021-05-31 17:44:05

ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాకుండా ఇక మన తెలుగు సినిమాలకు ఉత్తరాదిన ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమాలు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను క్రియేట్ చేస్తుంటాయి. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షెన్‌లు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. రామ్ నటించిన చిత్రాలు డబ్బింగ్ రూపంలో దుమ్ములేపుతుంటాయి. హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ ఇలాంటి సినిమాలు యూట్యూబ్‌లో దుమ్ములేపేశాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు వందల మిలియన్లు వ్యూస్‌ను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా దాదాపు రెండు మిలియన్ల లైకులను కూడా సొంతం చేసుకుంది.

More Related Stories