రివ్యూ: ఇస్మార్ట్ శంక‌ర్ismart
2019-07-18 15:49:42

న‌టీన‌టులు: రామ్, న‌భా న‌టేష్, నిధి అగ‌ర్వాల్, స‌త్య‌దేవ్, అశిష్ విధ్యార్థి, పునీత్ ఇస్సార్, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
కథ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పూరీ జ‌గ‌న్నాథ్
నిర్మాత‌లు: పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి

పూరీ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ కూడా ప‌క్కా మాస్ క‌థ‌తోనే తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఇది ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందా లేదా..?

క‌థ‌:
ఇస్మార్ట్ శంక‌ర్(రామ్) ఓ రౌడీ. అమ్మా నాన్న ఉండ‌రు.. అంతా కాకా చెప్పిన‌ట్లు చేస్తుంటాడు. అలాంటి వాడి జీవితంలోకి సివిల్ ఇంజ‌నీర్ చాందిని(న‌భా న‌టేష్) వ‌స్తుంది. ఆమెతో లైఫ్ అంతా ఊహించుకుంటాడు శంక‌ర్. అదే స‌మ‌యంలో ఓ సుపారీ తీసుకుని మాజీ ముఖ్య‌మంత్రిని చంపేస్తాడు. ఆ కేసులో జైలుకు వెళ్తాడు. అదే స‌మ‌యంలో శంక‌ర్ కేసును సిబిఐ ఆఫీస‌ర్ అరుణ్ (స‌త్య‌దేవ్) హ్యాండిల్ చేస్తుంటాడు. ఆయ‌న గాళ్ ఫ్రెండ్ పింకీ(నిధి అగ‌ర్వాల్) సైంటిస్ట్. మైండ్ నుంచి మ‌రో మైండ్ కు డేటా ట్రాన్స్ ఫ‌ర్ పై వ‌ర్క్ చేస్తుంటుంది. అలా షూటౌట్ లో చ‌నిపోయిన అరుణ్ బుర్ర‌లోని మెమొరీని శంక‌ర్ బుర్రకు ఫిక్స్ చేస్తుంది పింకీ. ఆ త‌ర్వాత ఏంటి క‌థ అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ అందుకోలేదు పూరీ జ‌గ‌న్నాథ్. క‌నీసం ఈయ‌న రాసే క‌థ‌ను కూడా స్టార్ హీరోలు న‌మ్మ‌డం లేదంటే ఎంత రొటీన్ క‌థ‌ల‌కు అల‌వాటు ప‌డిపోయాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి స‌మ‌యంలో కాస్త ఇస్మార్ట్ గా ఆలోచించి ఇస్మార్ట్ శంక‌ర్  సినిమా చేసాడు పూరీ. ఇందులో కూడా క‌థ రొటీన్ రివేంజ్ డ్రామానే కానీ దానికి పోలీస్ బుర్ర‌ను ఇచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో బుర్ర‌పై ప‌డుతున్నారు ద‌ర్శ‌కులు. స‌వ్య‌సాచి.. బుర్ర‌క‌థ త‌ర్వాత ఇప్పుడు మైండ్ మార్పిడితో వ‌చ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఫ‌స్టాఫ్ అంతా ప‌క్కా మాస్ క‌థ‌తోనే న‌డిపించాడు పూరీ. పూర్తిగా దిగువ స్థాయికి దిగిపోయి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ఈయ‌న‌. ప‌క్కా లోక‌ల్ మాట‌లు.. బూతులు.. డైలాగులు.. అన్నీ చూపించేసాడు. ఇక న‌భా న‌టేష్ తో వ‌చ్చే సీన్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు నో బ్రేక్స్ అన్న‌ట్లు సాగిపోయింది ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ. కానీ ఆ త‌ర్వాత మాత్రం బ్రేకులు ప‌డిపోయాయి. ఇంట‌ర్వెల్ లో ట్విస్ట్ ఓపెన్ అయిపోయిన త‌ర్వాత క‌థ ముందుకు జ‌ర‌క్కుండా అక్క‌డే ఉండిపోయింది. బుర్ర మార్చిన త‌ర్వాత ఓ సారి పోలీస్ ఆఫీస‌ర్.. మ‌రోసారి ఇస్మార్ట్ శంక‌ర్ వ‌స్తుంటాడు. ఆ స‌మ‌యంలో క‌న్ఫ్యూజ‌న్ వ‌స్తుంది. చివ‌రి వ‌ర‌కు రొటీన్ డ్రామాగానే న‌డిచింది ఈ క‌థ‌. అయితే పూరీ మార్క్ స్క్రీన్ ప్లే దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌. పైగా మాస్ ఆడియ‌న్స్ కు కూడా న‌చ్చేలా తెర‌కెక్కించాడు పూరీ జ‌గ‌న్నాథ్.

న‌టీన‌టులు:
రామ్ కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌ను బాగా ఎక్కించేసుకున్నాడు ఈయ‌న‌. తెలంగాణ యాస‌లో డైలాగులు అదుర్స్. న‌భా న‌టేష్, నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ షోలో అదిరిపోయారు. స‌త్య‌దేవ్ ఉన్న‌ది కాసేపే అయినా కూడా అత‌డి మీదే క‌థ అంతా న‌డుస్తుంది. మిగిలిన వాళ్లంతా త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:
మ‌ణిశ‌ర్మ చాలా రోజుల త‌ర్వాత క్యాచీ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇస్మార్ట్ శంక‌ర్ టైటిల్ సాంగ్ అదిరిపోయింది. ఎడిటింగ్ జ‌స్ట్ ఓకే.. కాక‌పోతే సెకండాఫ్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేదేమో..? రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. పూరీ ద‌ర్శ‌కుడిగా మాయ చేయ‌డం కంటే కూడా డైలాగ్ రైట‌ర్ గా దుమ్ము లేపాడు. ముఖ్యంగా తెలంగాణ మాట‌లు ఆయ‌న పెన్ నుంచి అలా పొంగుకుంటూ వ‌చ్చేసాయి. రొటీన్ క‌థే అయినా పూరీ మార్క్ స్క్రీన్ ప్లే బాగానే ప‌ని చేసింది.

చివ‌ర‌గా:
ఇస్మార్ట్ శంక‌ర్.. డ‌బుల్ దిమాక్ ఉంది ఇద‌ర్..

More Related Stories