టాలీవుడ్ మీద పడిన ఐటీ...మూకుమ్మడి దాడులు suresh babu
2019-11-20 21:12:42

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్  కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు చేపట్టింది. ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేశ్, హీరో నాని ఇళ్ల మీద కూడా ఈ సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇలా మొత్తం పది చోట్ల రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు కార్యాలయాల్లో ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సాధారణ తనిఖీలలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడితో ఆగక అంతే అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సురేష్‌ బాబుకు సంబంధించిన కార్యాలయాలతో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు,దర్శకుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. దాదాపు అందరు హీరోలు, నిర్మాతల ఆఫీసుల మీద ఈ రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories