జూన్ వరకు నో మేకప్.. మహేష్ ఫ్యామిలీ టైమ్.. Mahesh Babu
2020-01-08 22:36:56

మహేష్ బాబు కొన్ని నెలలుగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిత్రం పనులన్నీ పూర్తి చేసుకుని జస్ట్ విడుదల కోసం వేచి చూస్తున్నాడు. జనవరి 11న విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత వెంటనే మరో సినిమా మొదలుపెడతాడేమో అనుకున్నారు ఫ్యాన్స్.. కానీ దాదాపు ఐదు నెలలకు పైగానే హాలీడేస్ తీసుకుంటున్నాడు సూపర్ స్టార్.

ఈయన నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లితో ఉండబోతుంది. మహర్షి లాంటి సినిమా తర్వాత మరోసారి ఈయనతో సినిమాకు సిద్ధం అవుతున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రం 100 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో బాగానే ఇంప్రెస్ అయ్యాడు సూపర్ స్టార్. అందుకే మరో ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ నుంచి మొదలు కాబోతుంది. అప్పటి వరకు కథ కూడా పూర్తిగా సిద్ధం చేయాల్సిందిగా వంశీకి ఇప్పటికే మహేష్ నుంచి సూచనలు కూడా వెళ్లాయి. దాంతో ఆ దర్శకుడు ప్రస్తుతం ఇదే పనితో బిజీగా ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు మాత్రం మరో నాలుగు నెలల పాటు పూర్తిగా తన సమయాన్ని కుటుంబానికే కేటాయించబోతున్నాడు. 

More Related Stories